హమ్మయ్య.. తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఒప్పందం - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఒప్పందం

November 2, 2020

Vijayawada

కరోనా లాక్‌డౌన్ వల్ల ఏపీ, తెలంగాణల మధ్య ఏడు నెలలుగా నిలిచిపోయిన అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్డెక్కనున్నాయి. నాలుగు నెలల సదీర్ఘ చర్చలు, అపోహనలు, అనుమానాలను అధిగమించి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ఒప్పందం చేసుకున్నాయి. తక్షణమే ఇది అమల్లోకి రావడంతో నేటి రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు చక్కర్లు కొట్టనున్నాయి. 

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీలు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్టీసీ 1,61,258 కిలోమీటర్లు తిరుగుతాయి.  తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 1,60,999 కిలోమీటర్లు తిరుగుతాయి. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826,  తెలంగాణలో ఏపీ ఆర్టీసీ 638 బస్సులు చక్కర్లు కొడతాయి.  తెలంగాణ ఆర్టీసీ విజయవాడ రూట్‌లో 273 బస్సులు తిప్పుతుంది. ఏపీ 192 బస్సు సర్వీసులు నడుపుతుంది. ఎట్టకేలకు ఒప్పందం ఖరారు కావడంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించినట్లే. అంతర్రాష్ట్ర సర్వీసులు తిరక్కపోవడంతో ప్రైవేట్ బస్సులు భారీగా దోచుకున్నాయి.