telangna minister ktr meet microsoft ceo satya nadella
mictv telugu

సత్య నాదెళ్లతో కేటీఆర్ భేటీ.. బిజినెస్‌, బిర్యానీపై చర్చ అంటూ ట్వీట్

January 6, 2023

telangna minister ktr meet microsoft ceo satya nadella

తెలంగాణ మంత్రి కేటీఆర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళతో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న సత్యనాదెళ్ల హైదరాబాద్ రాగా..కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పంచుకున్నారు. ఇరువురి మధ్య ఆసక్తికర చర్చ జరిగిందని పేర్కొన్నారు. “ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళ్టి రోజును ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాం” అని కేటీఆర్ ట్విట్టర్‎లో వెల్లడించారు. ఐటీ, ఐటీ రంగాల అభివృద్ధిపై కేటీఆర్, సత్యనాదెళ్ల చర్చించినట్టు సమాచారం.

ప్రస్తుతం సత్యనాదెళ్ల భారత్‎లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్ర‌ధాని మోదీని క‌లిశారు. ఆ త‌ర్వాత బెంగుళూరులో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన్నారు. ఫ్యూచర్‌ రెడీ టెక్నాలజీ సమ్మిట్‌లో ‘చాట్‌ జీపీటీ’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఛాట్‌ రోబోను నాదెళ్ల పరిచయం చేశారు. ఆ రోబోతో ఆయ‌న మాట్లాడారు. భవిష్యత్తులో పాపులర్‌ సౌత్‌ ఇండియన్‌ టిఫిన్స్‌ ఏముంటాయని ఆయన చాట్‌ రోబోను ప్రశ్నించగా.. ఇడ్లీ, దోశ, వడ, బిర్యానీ అంటూ అది సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన సత్య నాదెళ్ల.. బిర్యానీని సౌత్‌ ఇండియా టిఫిన్‌ అని తనను అవమానించొద్దని వ్యాఖ్యానించారు.