తెలంగాణ, భారతదేశం కష్టాల్లో ఉన్నాయని, ప్రజలను ఆదుకోడానికి కాంగ్రెస్ కార్యకర్తలు దృఢసంకల్పంతో పని చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించడానికి ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ రోజు హైదరాబాద్లో జరిగిన పార్టీ రాజకీయ శిక్షణ తరగతిలో ఆయన ప్రసంగించారు.