పాకిస్తాన్‌ ప్రజలకు టెలికామ్‌ ఆపరేటర్లు గట్టిషాక్..సేవలు బంద్ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌ ప్రజలకు టెలికామ్‌ ఆపరేటర్లు గట్టిషాక్..సేవలు బంద్

July 1, 2022

పాకిస్తాన్‌లోని ప్రజలకు అక్కడి టెలికామ్ ఆపరేటర్లు గట్టిషాక్‌ ఇచ్చారు. ఇప్పటికే తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్‌లో నేటి నుంచి ఇంటర్నెట్‌ సేవలను పూర్తిగా బంద్‌ చేశారు. ఈ సేవలకు సంబంధించి గురువారమే టెలికామ్‌ ఆపరేటర్లు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆ ప్రకారమే శుక్రవారం నుంచి పాక్తిసాన్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.

నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం..”పాకిస్తాన్‌లో గంటల తరబడి కరెంట్‌ కోతలు కొనసాగుతున్నాయి. దీంతో ఇంటర్నేట్ సేవలు తీవ్ర అంతరాయాన్ని కల్గిస్తున్నాయి. అందుకే టెలికామ్‌ ఆపరేటర్లు మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలు ఆపేస్తామని హెచ్చరించారు” అని ఎన్‌ఐబీటీ వివరాలను వెల్లడించింది.

పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ మాట్లాడుతూజ..”పాక్‌ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే మొదటిసారి. ఇక, విద్యుత్‌ సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) సరఫరా ఇబ్బందికరంగా మారింది. ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాం” అని ఆయన అన్నారు.