వాట్సాప్ డౌన్.. నెటిజన్లు టెలిగ్రామ్‌కు క్యూ - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ డౌన్.. నెటిజన్లు టెలిగ్రామ్‌కు క్యూ

March 15, 2019

ప్రపంచ ప్రఖ్యాత చాటింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ గత కొన్ని రోజులుగా సరిగ్గా పనిచేయని సంగతి తెలిసిందే. దీంతో వాట్సాప్ వినియోగదారులు ఆ సంస్థకు భారీ షాక్‌ ఇచ్చారు. వాట్సాప్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో దానికి పోటీగా ఉన్న మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ యూజర్‌ బేస్‌లో దూసుకుపోతోంది. బుధవారం ఫేస్‌బుక్‌ యాప్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ల సేవలు స్తంభించిన నేపథ్యంలో యూజర్లు టెలిగ్రామ్‌ వైపు మళ్లి పోతున్నారని సాంకేతిక నిపుణులు వెల్లడించారు.

Telegram gained three million new users during Facebook outage.

కేవలం ఒక్కరోజేలోనే తమ కొత్త యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని టెలిగ్రామ్‌ సంస్థ వెల్లడించింది. ఫేస్‌బుక్‌‌కు చెందిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో తమ యూజర్ల సంఖ్య భారీగా పెరిగిందని టెలిగ్రాం తాజాగా వెల్లడించింది. కేవలం 24 గంటల్లోనే 30 లక్షల కొత్త వినియోగదారులు తమ నెట్‌వర్క్‌లో చేరారని టెలిగ్రాం ఫౌండర్‌ పావెల్‌ దురోవ్‌ తెలిపారు. వాట్సాప్‌కు పోటిగా వచ్చిన చాటింగ్‌ యాప్‌ టెలిగ్రాంకు ప్రస్తుతం 200 మిలియన్ల నెలవారీ యూజర్లు వున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ సొంతమైన ఇన్‌స్టా గ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ సేవలకు బుధవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోడింగ్‌లో సమస్యలు ఎదురైనట్టుగా పలువురు యూజర్లు కంప్లైంట్ చేశారు.