బాక్సింగ్ దిగ్గజంకు..బాలీవుడ్ బాద్‌షా సాయం - MicTv.in - Telugu News
mictv telugu

బాక్సింగ్ దిగ్గజంకు..బాలీవుడ్ బాద్‌షా సాయం

December 18, 2017

డబ్బులు అందరూ సంపాదిస్తారు, కానీ కష్టాల్లో ఉన్నవారికి  సాయం కొందరే చేస్తారు. కొందరికి కోట్లు సంపాదించినా ఇంకా ఏదో అసంతృప్తి పడుతుంటారు. సంపాదించింది బీర్వాల్లో, స్విస్ బ్యాంకుల్లో మగ్గాలే తప్ప, ఇతరులకు సాయం చెయ్యాలంటే మాత్రం వాళ్లకు ధైర్యం కాదు. ఆ మహానుభావుల గురించి మనకెందుకు గానీ…అసలు విషయానికి వస్తే బాలీవుడ్ హీర్ షారూఖ్ ఖాన్ మరోసారి  సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు.పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ దిగ్గజం కౌర్ సింగ్(69) గుండెజబ్బు కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే ఆసుపత్రిలో బిల్లు చెల్లించేందుకు పాపం ఆయన దగ్గర పైసలు లేవు. అయితే కౌర్ సింగ్ ఆరోగ్య పరిస్థిని ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఈవిషయం షారూఖ్ దృష్టికి రావడంతో కౌర్ సింగ్‌కు రూ. 5 లక్షల సాయాన్ని అందజేశాడు. పంజాబ్‌ ప్రభుత్వం రెండు లక్షల చెక్‌ను, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్‌ ఇండియా(బీఎఫ్‌ఐ) కూడా ఆయ‌న చికిత్స కోసం లక్ష రూపాయాలను అంద‌జేశారు. కౌర్ సింగ్ ఆసియా ఆటల్లో బంగారు పతకం సాధించాడు.