Tell me who is in this picture..?
mictv telugu

ఈ చిత్రంలో ఉన్నది ఎవరో చెప్పుకోండి..?

August 26, 2022

‘ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి? ఆయన ఎవరో చెప్పుకోండి’ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. ఫోటోలను వీక్షిస్తున్న వారంతా ఎవరు ఇతను? అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలలో ఉన్నది ఎవరో తెలుసకుందామా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా గాయకుడుగా, ప్రముఖ విప్లవ కవిగా పేరుగాంచిన గద్దర్‌..గతకొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా గద్దర్ యాదాద్రిలో ఉన్న లక్ష్మీనరసింహా స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్లిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గద్దర్ అంటే.. తెల్లగడ్డం, చేతిలో కర్ర, గొంగడి, మెడలో ఎర్ర రూమాల్, ఓ పుస్తకం వంటి ఆయన వద్ద నిత్యం ఉంటాయి. కానీ, తాజా ఫోటోల్లో ఆయన వేషధారణ విభిన్నంగా ఉంది. వీక్షిస్తున్నవారంతా ఇతను గద్దర్‌యేనా అనే ఆశ్చర్యపోతున్నారు.

గద్దర్..తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో జన్మించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేశారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. ఆయన రాసిన మరొక పాట “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు.