నాన్న చంపుతానంటున్నాడు.. బీజేపీ ఎమ్మెల్యే కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

నాన్న చంపుతానంటున్నాడు.. బీజేపీ ఎమ్మెల్యే కూతురు

July 11, 2019

తాను దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చంపుతానని తండ్రి బెదిరిస్తున్నాడని బీజేపీ ఎమ్మెల్యే కూతురు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను చంపుతామని రౌడీలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, దీని వెనక తన తండ్రి హస్తం ఉంది ఆమె ఆరోపించింది. 

ఉత్తరప్రదేశ్‌లోని బిథారి చేన్‌పూర్ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె సాక్షి మిశ్రా(23) అజితేశ్‌ కుమార్‌(29)ను ప్రేమించింది. వారి ప్రేమకు రాజేశ్ మిశ్రా తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఆయన కొంతమంది గూండాలను ప్రతిరోజూ తమ ఇంటికి పంపించి తమను బెదిరిస్తున్నారని సాక్షి మిశ్రా సెల్ఫీ వీడియోలో తెలిపింది. 

‘మాకు ప్రాణహాని వుంది. తండ్రి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నాను. ఆ గూండాలకు మేం చిక్కితే మమ్మల్ని చంపేస్తారు’ అని ఆందోళన వ్యక్తం చేసింది. తాను దళితుడిని అనే ఒకే ఒక్క కారణంతో సాక్షి వాళ్ల నాన్న తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆ వీడియోలో అజితేశ్ కూడా చెప్పాడు. దీనిపై స్పందించిన డీఐజీ వారికి  తప్పకుండా రక్షణ కల్పిస్తామని.. అంతకంటే ముందు వారి ఆచూకీ తెలుసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.