శాసన సభ సచివాలయం మాజీ కార్యదర్శి రాజా సదారాం ఆత్మీయ సత్కార సభ ఈరోజు అసెంబ్లీ లో జరిగింది. సదారాం ఎన్నో యెండ్ల పాటు శాసనసభ కు విలువైన సేవలు అందించారు. అన్నీ పార్టీ లతో సదారాం సమన్వయం చేసిన తీరు అభినందనీయం ,సదారాం మంచి సమన్వయ కర్త ,గత మూడేళ్ళుగా తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవడానికి సదారాం గణనీయమైన పాత్ర పోషించారు. సదారాం ఎవరిని నొప్పించక తానొవ్వక అనే పద్దతిలో ఓపిక తో మెదిలే వారు,తెలంగాణ శాసన సభ ను ఆదర్శంగా నడపాలన్న సీఎం కెసిఆర్ ఆలోచన కు దగ్గట్టు సదారామ్ పనిచేశారు అని నేతలు శాసనసభకు సదారం చేసిన సేవలను గుర్తు చేశారు. శాసనసభ కొత్త కార్యదర్శిగా వేదాంతం నర్సింహాచార్యులు నియమితులయ్యా రు. ఇప్పటివరకు కార్యదర్శిగా ఉన్న రాజా సదారాం పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం నర్సింహాచార్యులుని నియమించింది. రాజా సదారాం పదవీ కాలం గతంలో ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఆగస్టు వరకు పొడిగించింది.