mictv telugu

మోదీ ఏపి టూర్ వెనుక అసలు రహస్యం ఇదే…..

February 11, 2019

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ పర్యటన వివాదస్పదమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో అక్కడి పార్టీలన్నీ ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాయి. బీజేపీ హోదా ఇవ్వడం లేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీతో తాము దోస్తానా చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చాలా సార్లు చెప్పారు.  ఏపీకి ఇవ్వాల్సిన నిధులు విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారనీ అన్నారు. పైగా అక్కడ కాషాయ దళానికి ఉన్న సీట్లు కూడా పోయాయి. ఆరాష్ట్రంలో బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కమలం పార్టీ.

తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు నరేంద్ర మోదీని ఏపీ బీజేపీ నాయకులు  రాష్ట్రానికి రప్పించారు. మోదీ వచ్చి రాష్ట్రానికి ఏమిచ్చారో ఆయన ద్వారా చెప్పిస్తే ప్రజలకు సానుకూల సందేశాలు వెల్తాయని భావించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో హోదా అంశంమే కీలకం కాబోతోంది. దీంతో మోదీ లాంటి నాయకులు వచ్చి మాట్లాడితే కొంతలో కొంతైనా సానకూల ఫలితం ఉంటుందని వారి అంచనా.

యేడాది కాలంగా  హోదా గురించి తెలుగుదేశం నాయకులు రకరకాల ఆందోళనలు చేస్తున్నారు. పార్లమెంట్ వద్ద టీడీపీ ఎంపిలు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నారు. అయినా మోదీ స్పందించడం లేదని ఆరోపించారు. పైగా  ఏపీకి బీజేపీ తీవ్ర నష్టం చేస్తున్నదని చంద్రబాబుతోపాటు పార్టీ ఎంపీలూ విమర్శించారు. నిధులు కేటాయింపులో తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు.

వీటికి సమాధానమే మోదీ గుంటూరు సభ. తాను నాలుగున్నరేళ్ల కాలంలో ఏపీకి ఇచ్చినవి, ఇవ్వబోతున్నవీ  ఏమిటో చెప్పారు. తాము ఎంత చేసినా  సరే తెలుగుదేశం పార్టీ మాత్రం అభివృద్ధి చేయడం లేదని మోదీతో చెప్పించారు ఏపీ కమనాథులు. విద్యా సంస్థలు, కొత్త ఉపాధి సంస్థల ఏర్పాటు ఇలా దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల వరకు ఏపిపై ఖర్చు చేస్తున్నట్లు చెప్పించారు మోదీతో..

Telugu News Kuwait couple divorce 3 minutes after marrying..

అభివృద్ధి కార్యక్రమాల కంటే రాజకీయంగా సభను బాగా వాడుకునే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ. చంద్రబాబు నాయుడపైనా, లోకేష్ పైనా వ్యంగ్యంగా మాట్లాడారు. ఏ విషయాల గురించి మాట్లాడితే, ఎలా మాట్లాడితే జనాలకు బాగా అర్థం అవుతుందో ఆ విషయాల గురించే ప్రధానమంత్రివర్యులు ఎక్కువగా మాట్లాడారు. రెండేళ్ల నుండి తనపైనా, బీజేపీపైనా  తెలుగుదేశం నాయకులు సంధించిన ప్రశ్నలకూ సమాధానం చెప్పారు. నిధులు విషయం, కాంగ్రెస్‌తో పొత్తుల విషయం, ధర్నాల విషయం,జా తీయ స్థాయిలో కూటమి గురించిన ముచ్చట ఇలా అన్ని విషయాలకూ మోడదీ సమాధానం చెప్పినట్లు తన ఉపన్యాసాన్ని సాగించారు.

అంతేకాదు చంద్రబాబునాయుడు తన కంటే చాలా విషయాల్లో సీనియర్  అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలను తాను పెట్టనట్లు చెప్పుకుంటున్నారని  అన్నారు. అంతే కాదు సీనియర్ రాజకీయ నాయకునిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని అంటూనే రాజకీయాలు చేయడంలో  బాబు సీనియర్ అని అన్నారు. వెన్నుపోటు పొడవటంతో మీరు సీనియర్ అని, పార్టీలు ఫిరాయించడంలో సీనియర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు నీరు గార్చడంలో సీనియర్ అని విమర్శించారు. ఏపీలో రాజకీయంగా తామూ బాబును ఎదుర్కొంటామనే విషయాన్ని అక్కడి నాయకులు మోదీ సభ ద్వారా చెప్పించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి మాటలు మోదీ మాట్లాడ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో ఎదగాలనుకున్న బీజేపీ గుంటూరు సభను దానికి వేదికగా వాడుకునే ప్రయత్నం చేసింది.

ఎక్కడికి వెళ్లినా బీజేపీ నాయకులకు ఎదురవుతున్న ప్రశ్న హోదా గురించి. ఈ సభలో కూడా దాని గురించి ప్రస్తావన పరోక్షంగా వచ్చింది. నిధులు లక్షల కోట్ల  రూపాయల్లో ఇచ్చామని, చంద్రబాబు నాయుడు వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయారని మోదీ విమర్శించారు. అధికార పార్టీ వైఫ్యలాలను ఎత్తి చూపుతూ తాము చేసిన, చేయాలనుకున్న పనుల గురించి సవివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రధాన మంత్రి.

ఏపి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు,సీట్లు పెంచుకునేందుకు, తమతో కల్సి వచ్చే వారికి మార్గం సుగమమం చేసేలా మోదీ ఉన్యాసం సాగింది. అంతే కాదు రాబోయే రోజుల్లో ఏపీకి తాము ఏమి చేస్తామో కూడా చెప్పారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి  డోర్లు మూసి వేశామని అమిత్ షా చెప్పిన వారం రోజుల తర్వాత నరేంద్ర మోదీ గుంటూరులో సభకు హాజరయ్యారు.

ఏపి రాజకీయాల్లో జగన్, పవన్, చంద్రబాబుతో పాటు ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా జాయిన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పొత్తులు పెట్టుకుందా, లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తుందా అనే దాని గురించి ఇప్పటికిప్పుడే చెప్పలేక  పోయినా రాజకీయంగా తామూ ఏపీలో బలంగానే ఉంటామనే సంకేతాలను పంపించారు బిజెపి నాయకులు.Telug u news real intention pm modi tour in Guntur on the eve of special status to Andhra Pradesh