లాక్ డౌన్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్న యువ హీరో! - MicTv.in - Telugu News
mictv telugu

లాక్ డౌన్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్న యువ హీరో!

April 5, 2020

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో సినిమా షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. నటీనటులందరూ ఇళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. ఈ ఖాళీ సమయంలో వాళ్ళు చేస్తున్న పనులను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంటున్నారు. యువ హీరో నిఖిల్ సిక్స్ ప్యాక్ చేస్తున్నట్టు తన ఇంస్టాగ్రామ్ లో తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశాడు.  

నిలఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘కార్తికేయ-2′, ’18 పేజస్’ సినిమాల్లో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతోంది. ‘కార్తికేయ-2’ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా, కాళబైరవ మ్యూజిక్ ను అందిస్తున్నడు.