Home > Featured > నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్!

నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్!

టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఉన్నట్లుండి ఈయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన ఈయన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఈయనకు చికిత్స కొనసాగుతుంది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ విషయంపై శివాజీ రాజా స్నేహితుడు సురేష్ కొండేటి స్పందించారు. 'ఇప్పుడే శివాజీ రాజాతో మాట్లాడాను. బీపీ డౌన్ అయిపోయి హార్ట్ఎటాక్ వచ్చింది. స్టంట్ వెలసి వస్తుందని డాక్టర్లు తెలిపారు.' అని సురేష్ కొండేటి అన్నారు. గత కొన్ని రోజులుగా శివాజీ రాజా సొంత ఫామ్‌హౌజ్‌లో పండిస్తున్న కూరగాయలను సినిమా కార్మికులకు ఉచితంగా పంచి పెడుతున్నాడు.

Updated : 5 May 2020 11:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top