telugu avatar release business
mictv telugu

తెలుగు అవతార్‌-2 రిలీజ్.. 100 కోట్లైనా ఓకే !

November 2, 2022

అవతార్ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. సినిమా వచ్చి 12 సంవత్సరాలైనా ఆ విజువల్ వండర్‌ను ఎవరూ మర్చిపోలేదు. హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు మంత్రమగ్థులయ్యారు. ఇక దీనికి సీక్వెల్‌గా వస్తున్న అవతార్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదు నెలల క్రితం విడుదలైన టీజర్‌కు విషేష స్పందన వచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు 16న 160 భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రైట్స్‌ను దక్కించుకొనేందుకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ పోటీపడుతున్నారు. ఎన్ని కోట్లైనా తగ్గేదేలే అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందు కోసం ఏకంగా 100 కోట్లకు పైగా కొటేషన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.120 కోట్లు చెల్లించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ఉంటాయని, ముప్పై నుంచి నలభై కోట్ల దాకా రికవరీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే వీకెండ్ లో వంద కోట్లుకు వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.