‘ప్రభుత్వ పాట’ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న గద్దర్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్రభుత్వ పాట’ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న గద్దర్

December 4, 2019

ప్రజాయుద్ధనౌకగా ఘనకీర్తి సంపాదించుకున్న గాయకుడు గద్దర్ 73 ఏళ్ల వయసులో తనకు ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని శరణువేడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా తనను నియమించాలని కోరారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన పెద్ద వివరణ కూడా ఇచ్చుకున్నారు. 

gaddar.

‘దీనిపై చర్చ జరగడం మంచిదే. పాటకు, కళకు, అక్షరానికి వయసు, కులం, ప్రాంతంతో సంబంధం ఉండదు. నేను కోరుకున్నది కళాకారుడి ఉద్యోగమే.  ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించేందుకు అవకాశం వస్తుందని దరఖాస్తు చేసుకున్పాను. దయచేసి అందరూ తన కోసం కోట్లాడి ఉద్యోగం ఇప్పించండి. ఈ వయసులో నేను ఆడకపోయినా, పాడకపోయినా ఫరవాలేదు.ఇతర కళాకారులు పాడుతుంటే డప్పులు మోస్తాను…’ అని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తనను కలవలేదని స్పష్టం చేశారు. కొంతమంది మిత్రులతో ఆయన తన విషయం చర్చించారని పేర్కొన్నారు. కాగా, ఇంజినీరింగ్ చదివిన తన వద్ద ప్రస్తుతం ఎలాంటి సర్టిఫికెట్లూ లేవని, ఆడడం పాడటం తన వృత్తి అని గద్దర్ తన దరఖాస్తు పత్రంలో వివరించారు.