సినిమాల్లోకి బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్ - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాల్లోకి బిగ్‌బాస్‌ విన్నర్‌ రాహుల్ సిప్లిగంజ్

December 1, 2019

తెలుగు బిగ్‌‌బాస్‌ సీజన్‌ 3 విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ త్వరలో సినిమాల్లోకి రానున్నాడు. ఇప్పటి వరకు పాటలు పాడటం, వీడియో ఆల్బమ్స్‌ చేయటం ద్వారా పాపులర్‌ అయిన రాహుల్‌ త్వరలో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాతో రాహుల్ తెరంగేట్రం చేయబోతున్నాడు. 

‘ఇలాంటి మహానటులు నటిస్తున్న గొప్ప చిత్రంలో నాకు అవకాశం రావటం గర్వంగా ఉంది. దర్శకుడు కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నటుడిగా తొలి ప్రయత్నం, మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నా’ అంటూ రాహుల్ ట్వీట్‌ చేశాడు. కృష్ణవంశీ మరాఠి చిత్రం ‘నటసామ్రాట్‌’ సినిమాను తెలుగులో ‘రంగమార్తండ’ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు. మరాఠిలో నానా పటేకర్‌ పోషించిన పాత్రలో తెలుగులో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నాడు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదే సినిమాతో రాహుల్‌ సిప్లిగంజ్‌ నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు.