బీజేపీ గూటికి బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ గూటికి బిగ్‌బాస్ విన్నర్ కౌశల్

November 29, 2019

ప్రముఖ నటుడు, తెలుగు బిగ్‌బాస్-2 విన్నర్ కౌశల్ బీజేపీ పార్టీలో చేరారు. భార్య నీలిమతో కలిసి ఢిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాంమాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నడ్డా వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

kaushal

ఇదే కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుభారి కూడా బీజేపీలో చేరారు. కౌశల్ తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 లో పాల్గొని విజయం సాధించిన సంగతి తెల్సిందే. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కౌశల్‌కి గణనీయంగా అభిమానులు పెరిగిపోయారు. ఒకానొక సమయంలో కౌశల్ ఆర్మీలను కూడా ఏర్పాటు చేసి ఆయనకు మద్దతుగా నిలిచారు.