టాలీవుడ్ యంగ్ హీరో, తెలుగు బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ గాయపడ్డాడు. నడిసముద్రంలో చేపల వేటకు వెళ్లి పట్టుతప్పి నీటిలో దబ్బున పడిపోయాడు. గట్టి దెబ్బలే తగిలాయి. కాలికి నెత్తురు గాయమైంది. జాలర్లు వెంటనే నీటిలోకి దూకి అతణ్ని కాపాడారు. సోహైల్ విశాఖపట్నానికి చెందిన యూట్యూబర్ లోకల్‌బాయ్ నానితో కలిసి వేటకు వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది. నాని పడవలో ఎంజాయ్ చేసిన సోహైల్ చేపలు ఎలా పడతారు, వల ఎలా వెయ్యాలి వంటి వివరాలు తెలుసుకున్నాడు. తర్వాత అంచుపై నిలబడినప్పుడు పట్టుదప్పి పడిపోయాడు. నాని నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ మూవీ ఈ నెల 30 విడుదల కానున్న నేపథ్యంలో ప్రాచారం కోసం కుర్ర హీరో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. సొహైల్ ప్రమాదం నుంచి బయటడ్డంతో అభిమానులు ఊపిరి పీల్చుకుని, త్వరగా కోలుకోవాలని అని కోరుకుంటున్నారు.