టీఆర్ఎస్ ఎమ్మేల్యేకు బిగ్‌బాస్ విన్నర్ సవాల్... - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ ఎమ్మేల్యేకు బిగ్‌బాస్ విన్నర్ సవాల్…

November 18, 2019

తెలుగు బిగ్‌బాస్ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు సవాల్ విసిరారు. అదేంది రాజకీయాల్లో లేని రాహుల్.. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు సవాల్ చేయడమేంటి అనుకుంటున్నారా? ఇది రాజకీయ సవాల్ అనుకుంటే పొరబడినట్లే. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ సుమ కనకాల విసిరిన సవాల్‌ను రాహుల్ ఇటీవల స్వీకరించారు. 

అందులో భాగంగా ఆయన మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురిని నామినేట్ చేశారు. వారిలో ‘ఫలక్‌నుమా దాస్’ కథానాయకుడు, దర్శకుడు విశ్వేక్సేన్, నటుడు, దర్శకుడు దర్శకుడు తరుణ్ భాస్కర్, వరంగల్ వెస్ట్ ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్‌లున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ… తన జీవితంలో మొదటిసారి ప్రకృతిని పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చిన యాంకర్ సుమకు, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన టీఆర్ఎస్ ఎంపి సంతోష్‌కుమార్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని రాహుల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.