విక్రమ్ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు కమల్ హసన్. అదే ఊపులో వరుసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అయిపోయాడు. ఎప్పుడో మొదలెట్టిన భారతీయుడు 2 ఇప్పడు మళ్ళీ పట్టాలెక్కించాడు. 1996లో విడుదలై తమిళ తెలుగు హిందీ భాషల్లో సంచలనం సృష్టించిన ‘ఇండియన్’ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సెట్ లో క్రేన్ విరిగిపడటంతో నలుగురు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఈ మూవీ షూటింగ్ విషయంలో లైకా ప్రొడక్షన్స్ వారికి శంకర్ కు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అవి తారా స్థాయికి చేరడంతో శంకర్ ఈ ప్రాజెక్ట్ ని మధ్యలోనే ఆపేసిన విషయం తెలిసిందే. మళ్ళి ఇన్నాళ్లకు కమల్ హాసన్ చొరవ వల్ల మళ్లీ ‘ఇండియన్ 2’ పట్టాలెక్కింది. కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్ధ్ ప్రియా భవానీ శంకర్ సముద్రఖని బాబీ సింహా వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. కమల్ తో పాటూ ఇతర ముఖ్య యాక్టర్ల సన్నివేశాలన్నీ తెరకెక్కుతున్నాయి.ఇప్పుడు దీనికి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో షాక్ ఇవ్వబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. కమల్ తో పాటూ నటించడమంటే అదృష్టమని భావిస్తారు ఎవ్వరైనా. ఇప్పడు వెన్నెల కిషోర్ కు ఆ అదృష్టం దక్కిందని చెప్పుకుంటున్నారు.
అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ మూవీలో వెన్నెల కిషోర్ నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటించాడు.ఈ మూవీలో వెన్నెల కిషోర్ నటనని గమనించిన శంకర్ ‘ఇండియన్ 2’లో అతనిని షాకింగ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట. ‘ఇండియన్ 2’లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపర్ ట్విస్ట్ ఇవ్వబోతోందని… ఇంత వరకు ఈ తరహా పాత్రలో కమెడియన్ వెన్నెల కిషోర్ కనిపించలేదని ప్రతీ ఒక్కరిని షాక్ కు గురి చేయడం ఖాయం అంటున్నారు.