నాకొడుకును డాన్‌గా చూడాలనుకున్న  కానీ... - MicTv.in - Telugu News
mictv telugu

నాకొడుకును డాన్‌గా చూడాలనుకున్న  కానీ…

November 26, 2017

తానొకటి తలిస్తే దైవమెకటి తలిచిందని.. దావూద్ తన కొడుకును మరో డాన్ గా చేయాలని కలలు కన్నాడు. తుపాకీలు చేత పట్టిచ్చి, బాంబులు సుట్టిచ్చి, మరో తిరుగులేని డాన్ గా తయారు చేద్దామనుకున్నాడు. కానీ దావూద్ కొడుకు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పాకిస్థాన్‌లో ఓ మత గురువుగా మారిపోయాడు.

అందుకే ఇప్పుడు ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కొత్త రంది పట్టుకుంది.‘నా కొడుకును మరో డాన్ గా చూడాలనుకున్నాను. నా వ్యాపారాలను చూసుకుంటాడనుకుంటే, పాకిస్థాన్ కరాచీలో మత గురువయ్యాడు, నావ్యాపారాలను అప్పజెప్పుదామన్కుంటే  ఆధ్యాత్మికతలో మునిగిపోయాడని’ దావూద్ డిప్రెషన్ కి లోనవుతున్నాడట. ఈవిషయాన్ని దావూద్‌ సోదరుడు ఇక్బాల్‌ ఖస్కర్‌ పోలీసుల విచారణలో వెల్లడించారు.

‘దావూద్ కుమారుడు  మోయిన్ నవాజ్ కు తన తండ్రి దావూద్ చేసే అక్రమాలంటే ఇష్టం లేదని , అందుకే  కుటుంబం నుంచి విడిపోయి మతగురువుగా మారాడని  దావూద్ సోదరుడు పోలీసులతో చెప్పాడు. అయితే కొడుకు మతగురువుగా మారడంతో దావూద్‌కు ఎక్కడలేని దిగులు పట్టుకుందట.