‘అర్జున్ రెడ్డి’పై మరో వివాదం! - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’పై మరో వివాదం!

August 30, 2017

‘అర్జున్ రెడ్డి’ సినిమా మొదటి నుంచీ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. తాజాగా ఈ సినిమా కథ తనదంటూ ఖమ్మానికి చెందిన యువ దర్శకుడు నాగరాజు తెర మీదకు వచ్చాడు. తన దర్శకత్వంలో విడుదలైన ‘ ఇక సెలవ్ ’ సినిమాను మక్కీ టు మక్కీ కాపీ కొట్టి అర్జున్ రెడ్డి సినిమా తీసారని ఆరోపిస్తూ డైరెక్టర్ కు, ప్రొడ్యూసర్ కు కోర్టు నోటీసులు పంపాడు. తన కథను తన అనుమతి లేకుండా దొంగిలించినందుకు తనకు నష్ట పరిహారం కింద రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీస్కుంటానని నోటీసులో హెచ్చరించాడు. అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా..  ఈ కథ తన వ్యక్తిగత అనుభవాలతో తయారు చేసుకున్నట్టు చెప్పడం తెలిసిందే. కొత్త వివాదంలో ఇరుక్కున్న అర్జున్ రెడ్డి ఈ వివాదాన్ని ఎలా సర్దుమణిగించుకుంటుందో చూడాలి…

‘ఇక సెలవ్’ సినిమా కూడా వివాదాలకు కారణమైంది. ఇందులో ఆధునికత పేరుతో విచ్చలవిడితనానని గ్లోరిఫై చేశారని విమర్శలు వచ్చాయి. వివాహ వ్యవస్థను కించపరచారని, పెళ్లయిన యువతి భర్తను వదిలేసి పోవడం తప్పుకాదని చెప్పరని ఆరోపణలు వచ్చాయి.