సెల్ఫీ తీసుకుంటూ గోవా బీచ్‌లో తెలుగమ్మాయి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ తీసుకుంటూ గోవా బీచ్‌లో తెలుగమ్మాయి మృతి

May 16, 2019

గోవా బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీచ్‌లో ఓ తెలుగమ్మాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన అలలు.. ఆమెను సముద్రంతోకి తీసుకెళ్లిపోయాయి. వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన రమ్యకృష్ణ గోవా ప్రభుత్వ అనుబంధ వైద్యశాలలో పనిచేస్తున్నది. 2017 వరకు వరకు జగ్గయ్యపేట స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేసిన ఆమె.. 2018లో గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్ళింది.

Telugu girl died in goa beach while taking selfie.

బుధవారం సాయంత్రం సరదాగా గడపటానికి గోవా బీచ్‌కు వెళ్ళింది. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన అలలు.. ఆమెను సముద్రంతోకి తీసుకెళ్లిపోయాయి. దీంతో ఆమె మృతి చెందింది. రమ్యకృష్ణ మృతితో ఆమె కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. ఆమె స్వస్థలం జగ్గయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రానికి రమ్యకృష్ణ మృతదేహాన్ని జగ్గయ్యపేట తీసుకురానున్నారు.