తెలుగు హీరోలకు తెలుగు రాదు.. పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు హీరోలకు తెలుగు రాదు.. పవన్

December 2, 2019

Pawan Kalyan02

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని.. అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు హీరోలను ప్రశ్నించారు. తెలుగు భాషను కాపాడండంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగారు. మన భాషను కాపాడుకుందాం.. ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందామని పిలుపునిచ్చారు. 

తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో భాషా పండితులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనసేన తరఫున ‘మన నుడి-మన నది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘చాలామంది తెలుగు హీరోలకు తెలుగులో చదవడం, రాయడం రాదు. తెలుగు సినిమాల్లో రానురాను బూతులు ఎక్కువ అవుతున్నాయి. పాండిత్యం రానురాను తగ్గిపోతోంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యాలు తెలియవు. మేడసాని మోహన్ గారిలాంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్ప గొప్ప సినిమాలు వచ్చేవి. చాలామంది తెలుగు సినిమా హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు.. కానీ, తెలుగు రాదు. ఒక తెలుగు హీరోగా నాకివన్నీ బాధ కలిగిస్తున్నాయి. మన భాషా సంస్కృతులను కాపాడుకోకపోతే మనం అధోగతి పాలవుతాం’ అని పవన్ అన్నారు. ఆంగ్లమాధ్యమంలో చదువుకోవడం వల్లే తాను వ్యక్తిగతంగా చాలా నష్టపోయానని అన్నారు. పొట్టి శ్రీరాములు తీసుకువచ్చిన భాషా సంయుక్త రాష్ట్రం అర్థాన్ని మార్చేశారని వాపోయారు.