కేసీఆర్ ని అభినందించిన వెంకయ్య…

తెలంగాణ స్కూల్ల్స్ ,కాలేజీల్లో ఇంటర్ వరకు తెలుగు బోధన  తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  ట్విటర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మాతృభాషకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. వీలైనంత త్వరలో ఏపీ కూడా ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాల్సిందేనని తెలంగాణ సర్కార్  నిర్ణయం తీసుకుంది.

SHARE