తెలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్.. 

October 20, 2020

Telugu Language on American Ballot Box

దేశ భాషలందు తెలుగు లెస్సా.. అనే పదానికి మరోసారి విశిష్టత ఏర్పడింది. యావత్ తెలుగు ప్రజలు గర్వించే అద్భుత అవకాశం లభించింది. అది కూడా అగ్రరాజ్యం అమెరికాలో ఘనత దక్కడంతో పలువురు భాషా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల సమయంలో  బ్యాలెట్ బాక్స్‌పై తెలుగును కూడా ముద్రించారు. ఇటీవల అక్కడి ఎన్నికల సంఘం విడుదల చేసిన నమూనాలో ఈ విషయం వెల్లడైంది. 

నవంబర్‌ 3వ తేదీ నుంచి అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నిక సమయంలో బ్యాలెట్‌ పేపర్‌పై తెలుగు భాషలో కూడా రాయనున్నారు.  దీనికి సంబంధించిన అధికార హోదాను అక్కడి అధికారులు ధృవీకరించారు. అభ్యర్థుల వివరాలు  తెలుగులోనే కనిపించనున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తెలుగులో వివరిస్తారు. అక్కడి బ్యాలెట్ పేపర్‌పై ఉండబోయే భాషలను తెలుపుతూ ఇటీవల నమూనా విడుదల చేయగా.. అందులో తెలుగును కూడా చేర్చారు. కాగా,ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది ఆంధ్ర, తెలంగాణలతో పాటు అమెరికా, ఇతర దేశాల్లోనూ ఉన్నారు.  అగ్రరాజ్యంలో తెలుగు వారి ప్రాభల్యం అంతకంతకూ పెరుగుతుండటం కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. ఇప్పటికే అక్కడి అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తుండగా, తెలుగు వారు కూడా అధికంగా ఉండటం విశేషం.