నాగార్జున నిర్మాత, అఖిల్ హీరో, నేను దర్శకుణ్ణి - MicTv.in - Telugu News
mictv telugu

నాగార్జున నిర్మాత, అఖిల్ హీరో, నేను దర్శకుణ్ణి

March 28, 2018

ఫ్లాపులతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్‌తో వర్మ సినిమా చేస్తున్నట్టు సమాచారం. వర్మ స్వయంగా  తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ 1989లో అక్కినేని నాగార్జున హీరోగా నా తొలి సినిమా ‘ శివ ’ చేశాను. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత ఆయనతో ‘ ఆఫీసర్ ’ సినిమా చేస్తున్నాను. త్వరలో నాగార్జున నిర్మాతగా అఖిల్ సినిమా రాబోతోంది. దానికి దర్శకుణ్ణి నేనే ’ అని వర్మ పోస్ట్ పెట్టారు. మే 25 కు ఆఫీసర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ చిత్రం విడుదలయ్యాక అఖిల్ సినిమా చేస్తాడని తెలుస్తోంది. కాగా ‘ లక్ష్మీస్ ఎన్టీర్ ’ సినిమా గురించి వర్మ ఈ మధ్య ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.

Just love the circle of life Akkineni Nagarjuna produced my debut #Shiva and now after some 25 years I produced…

Posted by RGV on Tuesday, 27 March 2018