కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. తెలుగు మహాసభలకు రాష్ట్రపతి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. తెలుగు మహాసభలకు రాష్ట్రపతి

November 24, 2017

కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతిని తీసుకొస్తానన్న  మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు వెలుగులను దశదిశలా వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 15 వ తారీఖు నుంచి 19 తారీఖు దాకా అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది.మహాసభలు జరిగే ఏదో ఒక రోజు రాష్ట్రపతిని రప్పించి సభలకు మరింత ఖ్యాతి తీసుకొస్తానని సిఎం కేసీఆర్ అధికారులతో చెప్పారు. తెలుగు మహాసభలకు రావాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు కేసీఆర్ ఆహ్వానించారు. చివరి రోజు సభలకు రావడానికి రాంనాథ్ కోవింద్ ఒప్పుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పతి పర్యటనకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడానికి రెడీ అవుతోంది.