యూపీలో బీజేపీ గెలుపు వెనుక తెలుగు వ్యక్తి - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో బీజేపీ గెలుపు వెనుక తెలుగు వ్యక్తి

March 10, 2022

15

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ గెలుపు వెనుక ఓ తెలుగు వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు సత్యకుమార్. బీజేపీలో తన స్వయంక‌ృషితో ఎదుగుతూ ప్రస్తుతం జాతీయ స్థాయి నేతగా మారారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో దాదాపు 135 సీట్ల గెలుపులో సత్యకుమార్ కీలక పాత్ర పోషించారు. పార్టీ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రచారం, బలాబలాల విశ్లేషణ, నాయకుల మధ్య సమన్వయం, బూత్  స్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడం వంటి కార్యక్రమాల ద్వారా బీజేపీ గెలుపును సునాయాసం చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్యకుమార్ గతంలో వెంకయ్యనాయుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వద్ద పీఏ గా పనిచేశారు. ప్రస్తుతం యూపీ కో ఇన్‌ఛార్జ్‌తో పాటు అండమాన్, నికోబార్ దీవులకు పార్టీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. బాగా లో ప్రొఫైల్ మెయింటెన్ చేసే సత్యకుమార్ పార్టీ గెలుపు సందర్భంగా.. యోగీ ఆదిత్యనాథ్ ఒక లక్షా రెండు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు, పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.