అందులో ఉన్నది నిత్యానందే... - MicTv.in - Telugu News
mictv telugu

అందులో ఉన్నది నిత్యానందే…

November 22, 2017

వివాదాస్పాద  స్వామిజీ నిత్యానందకు చిక్కులు తప్పేలా లేవు. సినీనటి రంజితతో సన్నిహితంగా ఉన్న వీడియోలో ఉన్నది నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ స్పష్టం చేసింది.ఈ వీడియోలో ఉన్నది తాను కాదని మార్ఫింగ్ చేశారని  నిత్యానంద వాదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ  ఫోరెన్సిక్ ల్యాబ్ అందులో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ, నివేదికను బుదవారం వెలువరించింది.

2010లో నిత్యానంద స్వామి రాసలీలల వీడియోను, ఆయన కారు డ్రైవర్ లీక్  చేశాడు. దాంతో స్వామిపై భక్తుల్లో నమ్మకం పోయింది. తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు నిత్యానంద.

ఇప్పటికే నిత్యానందపై పలు కేసులు నమోదు అయ్యాయి. 2010లో తనను అత్యాచారం చేశాడంటూ  శిష్యురాలు అరతీరావ్ కోర్టును ఆశ్రయించింది. దాంతో  నిత్యానందపై రేప్ కేసు నమోదు అయింది. తాను ఆధ్యాత్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వ్యామోహం లేదని  చెప్పాడు.

తనకు పురుషత్వ పరీక్షలు నిర్వహించకూడదన్న నిత్యానంద వాదనలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాకుండా లింగ సామర్థ్య నిర్ధారణ పరీక్షలకు ఆయన నిరాకరించడంతో సుప్రీంకోర్టు మందలించింది.