అంతర్జాతీయ వేదికపై నాటునాటు అద్దిరిపోతోంది. భారత దేశానికి మొదటిసారి ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు తీసుకొచ్చిన ఈ పాటలో గొప్పేమిటో మనకు తెలిసిందే. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్‌ల ఎనర్జిటిక్ సిగ్నేచర్ స్టెప్పులు, కీరవాణి ఊపేసే మ్యూజిక్.. మొత్తంగాపాట అంటే తెల్లోళ్లదే కాదు, ఆసియా, ఇండియా, ఆఫ్రికా వంటి ప్రాంతాలవారిదీ అని చాటుచెప్పింది ఈ పాట. ఎందరో ప్రపంచ ప్రఖ్యాత గాయనీగాయకుల పాటతో పోటీపడి, వాటిని వెనక్కి నెట్టేసిన నాటునాటు పాటను, ఇండియా టాలెంట్‌ను ప్రపంచం కన్నెత్తి చూడక తప్పదిక. మరి గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ బరిలో నాటునాటుతో పోటీపడిన చితికిలబడిన పాటలేమిటో తెలుసుకుందామా?
And the GOLDEN GLOBE AWARD FOR BEST ORIGINAL SONG Goes to #NaatuNaatu #GoldenGlobes #GoldenGlobes2023 #RRRMovie
— RRR Movie (@RRRMovie) January 11, 2023
బార్బడోస్‌లో పుట్టి అమెరికాలో అడుగుపెట్టి ప్రపంచ ఖ్యాతి సంపాదించుకున్న రిహానా ‘‘బ్లాక్ పాంథర్ వకాండా ఫరెవర్’ మూవీ కోసం పాడిన ‘లిఫ్ట్ మి అప్’ గోల్డెన్ గ్లోబ్ ఫైనల్ లిస్టుకు చేరింది. సినిమా కూడా హిట్ కావడంతో పాటకు కూడా పట్టం కడతారని భావించారు. మరో ప్రఖ్యాత గాయని లేడీ గాగా పాడిన ‘‘హోల్డ్ మై హ్యాండ్’’ (టాప్ గన్ మేవరిక్ మూవీ), ఇంకో గాయని టేలర్ స్విఫ్ట్ (వేర్ ద క్రాడాడ్స్ సింగ్), గియుర్మో డె టోరో ‘‘సియా పాపా,’’(పినోచినో) వంటి పాటలు ఈ బరిలోకి దిగాయి. ఇవన్న పాశ్చాత్య దేశాల సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నవే అయినా జ్యూరీలు మాత్రం నాటునాటుకే స్టెప్పులు వేశారు.