మహారాష్ట్ర రాజకీయం..'ఆకలిరాజ్యం'లో ఆసక్తికర చర్చ - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర రాజకీయం..’ఆకలిరాజ్యం’లో ఆసక్తికర చర్చ

November 27, 2019

మహారాష్ట్ర రాజజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలోని ఓ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ఆ సినిమాలో కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు. ఆయన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?’ అని ప్రశ్నిస్తారు. దీనికి కమల్‌ బదులిస్తూ..’ఈ రోజా.. నిన్నా.. మొన్ననా..? ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారు కదా!’ అని సమాధానమిస్తాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది. గత శనివారం దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో నిన్న రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నెల 28న శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.