అమెజాన్ కస్టమర్ల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది.సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. అమెజాన్ ఫ్రైమ్స్ మెంబర్స్ కు మాత్రం ఒక రోజు ముందుగానే ఈ ఆపర్లును పొందనున్నారు. గ్రేట్ ఇండియాఫెస్టివల్ సేల్ లో భాగంగా 40 వేల పైగా కస్టమర్లకు ఆఫర్లు ఇస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ప్రతి గంటకు కొత్త కొత్త ఆఫర్లు కస్టమర్లను ఆకర్షించనున్నట్టు తెలిపింది. మెుబైల్స్ పైనే 500కు పైగా ఆఫర్లు ఉండగా, ఎలక్ట్రినిక్స్ పై 2500కు పైగా ఆఫర్లు ఉన్నాయి.ఫ్యాషన్ ఐటమ్స్ పై 30 వేలకు పైగా ఆఫర్లు ,ఎక్స్ క్లూజివ్ ప్రోగక్ట్స్ పై 6వేలకు పైగా ఆఫర్లు ను ఉంచింది. ఆపిల్, సామ్ సంగ్, వన్ ప్లస్,లెనోవో, ఎల్ జీ లాంటి మెుబైల్స్ పై 40 శాతం వరకు భారీ డిస్కౌంట్లు ఉన్నట్టు చెప్పింది. ఇక ఈ ఆఫర్లులో హెచ్ డీఎఫ్ సీ, క్రెడిట్, డెబిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం (గరిష్టంగా రూ.500) వరకు క్యాష్ బ్యాక్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ ఆపర్లు కూడా వినియోగాదారులను ఆకర్షిస్తున్నాయి.