అదిరే స్టెప్పులతో తమన్నా' స్వింగ్ జర'  సాంగ్… - MicTv.in - Telugu News
mictv telugu

అదిరే స్టెప్పులతో తమన్నా’ స్వింగ్ జర’  సాంగ్…

September 15, 2017


అందాల భామ తమన్నా ఇప్పటితకే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు’ సినిమాల్లో ప్రత్యేక గీతాలల్లో నటించి అదరహో అనిపించింది. తాజాగా “జై లవకుశ” సినిమాలోని  ‘స్వింగ్ జర ‘ సాంగ్ లో తమన్నా గ్లామర్ , అదిరే స్టెప్టులు, ఎన్టీఆర్ స్టెప్టులు కూడా ఆడియన్స్ మతులు పొగొడుతున్నాయ్. కొరియోగ్రాఫర్ నుంచి మ్యూజిక్ వరకు అన్నింటిలోను కొత్తదనం కన్పించింది.  ప్రస్తుతానికి ప్రోమో సాంగ్ తోనే అభిమానులను ఆనందపరిచింది చిత్ర యూనిట్. అయితే పూర్తి సాంగ్ థియేటర్లులో ఏ రేంజ్ లో హంగామా  చేస్తుందో  తెలియాలంటే సెప్టెంబర్ 21 వరకు ఆగక తప్పదు. ఈ మూవీలో  హీరోయిన్లుగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్, బాబీ డైరెక్షన్ లో నిర్మిస్తున్నారు.