మాదాపూర్‌లో లిఫ్ట్ తెగి.. ఇద్దరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మాదాపూర్‌లో లిఫ్ట్ తెగి.. ఇద్దరి మృతి

December 16, 2017

మాదాపూర్‌లో శనివారం లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.  ఎన్‌సీసీ భవనంలో ఈ  ప్రమాదం జరిగింది. లిఫ్ట్ మరమ్మతులు చేస్తుండగా లిఫ్ట్ తెగి ఇద్దరు కార్మికులపై పడిపోయింది. వారు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు.మృతులను నాగరాజు, శ్రీనుగా పోలీసులు గుర్తించారు. ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు. మృతదేహాలు పోస్టు మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు.