హీరోయిన్లకు తోకలు కత్తిరిస్తాం.. శివాజీరాజా - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్లకు తోకలు కత్తిరిస్తాం.. శివాజీరాజా

February 13, 2018

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లకంటే ఉత్తరాది, కోలీవుడ్, మాలీవుడ్‌ హీరోయిన్లపై పైచేయి. కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. తమకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హవా నడిపించేస్తున్నారు. దీంతో నిర్మాతలకు సమస్యలు వస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చేయూతా ఇవ్వడం లేదు ఈ కథానాయికలు. దీనిపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు శివాజీరాజా ఘాటుగా స్పందించాడు.  
‘తెలుగు రాష్ట్రాలకు వచ్చి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు ‘మా’ కార్యక్రమాలకు బతిమాలినా రావడం లేదు. మేం చేపట్టే ఏ మంచి పనికీ సహకరించడం లేదు.. ‘అమ్మా అమ్మా’ అని బతిమాలుతుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే సహకరిస్తున్నారు..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి తలబిరుసు హీరోయిన్లు.. నిర్మాతలు ఇచ్చిన ఏదైనా చెక్కులు బౌన్స్ అయితేనే ‘మా’ సభ్యత్వం కోసం పరిగెత్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశాడు. ‘హీరోయిన్లు తోకలు జాడిస్తే కనికరం లేకుండా కత్తిరిస్తాం’ అని  హెచ్చరించాడు. మిగతా కార్యక్రమాలకు ఇచ్చేంత డబ్బు ఇవ్వలేకపోయినా, మా కూడా ఎంతో కొంత ఇస్తుందని అన్నాడు. హీరోయిన్లు కచ్చితంగా ‘మా’ సభ్యత్వం తీసుకోవాల్సిందేనని మా నేతలు హెచ్చరించారు.