మా మొగుళ్లు తాగడానికి ఓ వైన్ షాప్ పెట్టండి - MicTv.in - Telugu News
mictv telugu

మా మొగుళ్లు తాగడానికి ఓ వైన్ షాప్ పెట్టండి

December 1, 2017

                              ఎక్కడైనా వైన్ షాప్ వద్దని ఆడోళ్లు లొల్లి చేస్తరు. కాని మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్ల మాత్రం దీనికి ఫుల్ రివర్స్ లో జరిగింది. తమ ఊళ్లో ఓ వైన్ షాప్, లేదంటే కనీసం బెల్ట్ షాప్ అయినా పెట్టాలన్న డిమాండ్ తో ఊరు ఊరంతా రోడ్డు మీదికొచ్చింది. ఆడ, మగా తేడా లేకుండా అందరూ వైన్ షాప్ కావాలని ధర్నా చేసిన్రు. ఇంతకీ మ్యాటరేంటంటే….

ఒంగోలు పక్కన ఉన్న ఓ ఊళ్ల నిన్న మొన్నటి దాకా ఓ వైన్ షాప్ ఉండేది.  ఏమైందో ఏమో కొన్ని రోజుల కింద ఆ షాప్ బంద్ అయింది.  దీంతోని ఊళ్లోని తాగుబోతులకు మస్తు తక్లీఫ్ అయింది. సాయంత్రం కాంగనే సుక్క కోసం నాలుక గుంజేది. ఒకటి రెండు రోజులు ఎట్లనో ఓర్సుకున్నరు. కాని ఇగ వాళ్ల వశం కాలేదు. ఆగం ఆగం అయిన్రు. ఎట్లైతే అట్లై అని 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో ఊరి వైన్ షాప్ కు లైన్ కట్టిన్రు. సాయంత్రం అయిందంటే సాలు రోజు ఇదే కథ. పక్క  పొంటి ఊరుకు పోవుడు, ఫుల్లుగ తాగుడు.  కొందరు ఆడ్నే రోడ్ల మీద పంటే, ఇంకొదరు కిందా మీద పడుకుంట ఎట్లనో ఇంటికొచ్చేది.  కొందరు సేఫ్ గా వస్తే ఇంకొందరు యాక్సిడెంట్ లల్ల కాళ్లు చేతులు ఇరగొట్టుకున్నరు.

              మందు కోసం మగోళ్లు పడుతున్న కష్టం చూసిన ఊరి ఆడోళ్లకు గడ్ల నిండా నీళ్లొచ్చినయ్. అటెంక మన ఊళ్ల వైన్ షాప్ ఉంటే ఈ కష్టం ఉండదు కదా అనుకున్నరు. అంతే ఇంగ ఊళ్లున్న ఆడోళ్లంత జమైన్రు. ఊళ్ల కూడా మందు షాప్ ఉండాలని మాట్లాడుకున్నరు. ఈ ముచ్చటకు మొగోళ్లు కూడా మద్దతిచ్చిన్రు. అందరు కల్సి ఒంగోలు సెంటర్ ల ధర్నాకు కూసున్నరు. వెంటనే తమ ఊళ్ల వైన్ షాప్ పెట్టాలని డిమాండ్ చేసిన్రు.

చూద్దాం అంధ్రా ఆబ్కారోళ్లు ఏం చేస్తరో…..