20 రోజుల్లో కోటి వ్యూస్ దాటిన మన సంక్రాంతి పాట! - MicTv.in - Telugu News
mictv telugu

20 రోజుల్లో కోటి వ్యూస్ దాటిన మన సంక్రాంతి పాట!

January 30, 2018

సంక్రాంతి పండుగ అయిపోయి 15 రోజులు అవుతుంది. అయినా కూడా మైక్‌టీవీ సంక్రాంతి పాటకు ఊపు మాత్రం అలాగే ఉంది.  పాటను మీముందుకు తెచ్చిన 20 రోజుల్లోనే  కోటి వ్యూస్ దాటాయంటే..దీన్ని బట్టే అర్థమవుతోంది సంక్రాంతి పాట మీకు ఎంతగా నచ్చిందో!

ఇంత తక్కువ సమయంలో కోటి వ్యూస్ ఇచ్చిన మీకు ధన్యవాదాలు. కోటి చుక్కలతో మా మనసులో మీ ప్రేమ అనే అతిపెద్ద  సంక్రాంతి ముగ్గును వేసినంత ఆనందంగా ఉంది. ‘పుట్టిన ఊరి చూసి నయనాలే.. కృష్ణా గోదావరి నదులాయే’ అంటూ కందికొండ రాసిన లిరిక్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ గొంతులోని మాధుర్యం..ర్యాప్‌ని కలగలిపి  చేసిన ఈపాట ఎన్కటి ముసలోళ్ల దగ్గరనుంచి నేటి కుర్రకారుకు సైతం తెగ నచ్చేసింది.

దాము కొసనం దర్శకత్వంలో మైక్ టీవీలో వచ్చిన  రేలారే రేలా, డిల్లెం బల్లెం, బతుకమ్మ, సంక్రాంతి, మేడారం పాటలలాగే మీకు నచ్చే మరిన్ని పాటలను మైక్ టీవీ మీముందుకు తెస్తుంది. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని కోరుకుంటూ.. మన సంక్రాంతి పాటకు కోటి వ్యూస్ ఇచ్చినందుకు మరోసారి మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్యూ….మీ మైక్‌టీమ్