బెంగళూరులో పేలుడు..శాస్త్రవేత్త మృతి.. ఉగ్ర టార్గెట్ లేబ్‌లో ఘటన

ప్రయోగశాలలో భారీ పేలుడు సంభవించి ఓ యువ శాస్త్రవేత్త మృతి చెందగా..  మరో ముగురికి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో బుధవారం మధ్యాహ్నం ఏరోస్పేస్ విభాగానికి చెందిన హైపర్ సోనిక్ షాక్ వేవ్ ప్రయోగశాలలో హైడ్రోజన్ సిలిండర్ పేలింది. ఐఐఎస్‌సీతో ఒప్పందం చేసుకున్న సూపర్‌వేవ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఆ సమయంలో ప్రయోగాలు చేస్తున్నారు.

yyy

ఈ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మైసూరుకు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన ముగ్గురు శాస్త్రవేత్తలు కార్తీక్, అతుల్య, నరేశ్ కుమార్ లను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.

అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే హైడ్రోజన్ వాయువు ఎక్కువ విడుదల కావడం వల్లే పేలుడు జరిగుండొచ్చని ఫోరెన్సిక్ అదికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఐఎస్‌సీ చాలా రోజుల నుంచి ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉంది.