హిట్లు లేని అఖిల్‌కు 10కోట్ల పారితోషికం! - MicTv.in - Telugu News
mictv telugu

హిట్లు లేని అఖిల్‌కు 10కోట్ల పారితోషికం!

March 13, 2018

అఖిల్’ ఘోర పరాజయం. ‘హలో’ అంతంత మాత్రంగానే ఆడింది. అయినా అక్కినేని అఖిల్  చరిష్మా తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడతను తన మూడవ సినిమా కోసం రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి. అఖిల్ అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చి అతనితో ముచ్చటగా మూడో సినిమా ఎవరు చేస్తారబ్బా .. అని అక్కినేని అభిమానులు ఎదరుచూస్తున్నారు. వారి ఎదరుచూపులకు ఫలితం దక్కనుంది.

ప్రస్తుతం అఖిల్‌తో సినిమా చేయటానికి ఏ దర్శకుడూ ముందుకు రాని తరుణంలో ఇద్దరు దర్శకనిర్మాతలు వచ్చారు. వారిలో ఒకరు ఈ మధ్యే వరుణ్ తేజ్‌కి ‘ తొలిప్రేమ ’ వంటి హిట్టిచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి. ఇంకొకరు భారీ చిత్రాల నిర్మాతగా పేరుపొందిన భోగవల్లి ప్రసాద్ ఈ కుర్ర హీరోతో సినిమా చేయటానికి ఆసక్తిని చూపుతున్నారట.

అఖిల్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఎలాగైనా అతనికి మూడో సినిమా హిట్టివ్వాలని నిర్మాత కసి మీద వున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. తొలుత వెంకీ అట్లూరి తన తదుపరి సినిమా కోసం శర్వానంద్‌ను కూడా కలిసాడట. అఖిల్ అయితేనే తన సబ్జెక్టుకు న్యాయం చెయ్యగలడని భావించాడని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.