‘ఎంఎస్ ధోనీ’ పాటకు 10 కోట్ల వ్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఎంఎస్ ధోనీ’ పాటకు 10 కోట్ల వ్యూస్

October 25, 2017


క్రికెటర్ ఎంఎస్ ధోనీ  జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన హిందీ సినిమా ‘ఎంఎస్ ధోనీ’. ఈ సినిమాలోని ‘కౌన్ తుజే’ అనే పాట సినిమా విడుదలయ్యాక  చాలా మందిని ఆకట్టుకుంది. అయితే తాజాగా యూట్యూబ్‌లో ఈ పాటకు పదికోట్ల వ్యూస్ వచ్చాయి. ధోనీ పాత్రలో సుశాంత్ సింగ్ నటించాడు. ఎంతో మంది మనసును గెలుచుకున్న ‘కౌన్‌తుజే’ పాట పదికోట్ల వ్యూస్‌ను సాధించడం, ఎంతో సంతోషంగా ఉందంటూ టీసిరీస్ తమ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.