10 నిమిషాలకు 50 లక్షలు.. తమన్నా స్టెప్పేస్తే.. - MicTv.in - Telugu News
mictv telugu

10 నిమిషాలకు 50 లక్షలు.. తమన్నా స్టెప్పేస్తే..

April 7, 2018

సినిమాల్లో హీరోహీరోయిన్లకు ఒక్కసారి స్టార్‌డమ్ వచ్చిందంటే ఇక వారికి కాసుల పంట పండినట్టే అంటారు. నిమిషాలు, గంటలకు డబ్బులు వసూలు చేస్తుంటారు. తాజాగా తమన్నా కేవలం పది నిమిషాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటోందో తెలిస్తే షాక్ అవాల్సిందే. కాసేపట్లో ఐపీఎల్ – 11 సీజన్ ప్రారంభం అవుతోంది. అయితే వేదిక మీద ప్రారంభం గ్లామర్‌తో కళకళలాడాలని అనుకున్నట్టున్నారు ఐపీఎల్ నిర్వాహకులు.మిల్క్ బ్యూటీ తమన్నా చేత ఐపీఎల్ వేదిక మీద స్టెప్పులు వేయించాలని అనుకున్నారు. ఇందుకోసం తమన్నాకు 10 నిమిషాల కోసం రూ. 50 లక్షలు చెల్లిస్తున్నారు. పది నిమిషాలు డాన్స్ చేసినందుకు తమన్నా అక్షరాల 50 లక్షల రూపాయలు తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుదేవాతో కలిసి తమన్నా డాన్స్ చేయబోతోంది. ఇదే వేదికపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా స్టెప్పులు వేయనున్నాడు. ఈ ప్రదర్శన కోసం ఆమె షయామక్ ధావర్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటోంది.