సులుభ వ్యాపారంలో భారత్‌కు 100వ ర్యాంకు - MicTv.in - Telugu News
mictv telugu

సులుభ వ్యాపారంలో భారత్‌కు 100వ ర్యాంకు

November 1, 2017

ప్రపంచ వ్యాప్తంగా సులభంగా వ్యాపారం నిర్వహించే దేశాలలో భారత్‌కు 100 వ స్థానం దక్కింది. గత రెండేళ్లుగా 131,130  ర్యాంకుల్లో ఉన్న  మనదేశం,  ఒక్కసారిగా ముప్పై  ర్యాంకులకు ఎగబాకి  100వ స్థానంలో నిలిచింది.

రాబోయే 5 ఏళ్లలో 50వ ర్యాంకుకు చేరే అవకాశాలు ఉన్నాయని, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు.  మొదటి స్థానంలో న్యూజిలాండ్, రెండవ స్థానంలో సింగపూర్, డెన్మార్క్(3)  నిలిచాయి. ఇక మనదేశంలోని  రాష్ట్రాల వారీగా చూస్తే  తెలంగాణకు మొదటి స్థానం లభించింది.  ఇక సులువు వ్యాపారం నిర్వహించే  17 నగరాల్లో  జరిపిన సర్వేలో హైదరాబాద్ కు  రెండో స్థానం రావడం విశేషం.