11 మంది పెళ్లాడిన మాయలేడి - MicTv.in - Telugu News
mictv telugu

11 మంది పెళ్లాడిన మాయలేడి

September 10, 2017

అబ్బాయిలు అమ్మాయిలను ప్రేమ పేరుతో  మోసం చేస్తుంటారు. అధిక కట్నకానుకల కోసం అమ్మాయిలను హింసిస్తుంటారు.. మనం ఇలాంటి వార్తలను విన్నాం, కొన్నింటిని కళ్లారా చూసి ఉంటాం.  కానీ దీనికి భిన్నంగా థాయిలాండ్ కు చెందిన జారియాపోర్న్ బుయాయి(32) ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుంది. థాయిలాండ్ సంప్రదాయం ప్రకారం వరుడే వధువుకి కట్నకానుకలను ఇస్తాడు. దానిని అసరాగా చేసుకుని ఆమె 11 మందిని పెళ్లి చేసుకుంది. దాదాపుగా ఒక్కోఒక్క వరుడి నుంచి కట్నంగా రూ.3 లక్షల నుంచి 19 లక్షల వరకు కట్నంగా తీసుకుంది.  మెుత్తం 11 మంది వరుళ్ల దగ్గర నుంచి 60 లక్షలు కట్నంగా తీసుకుంది ఈ ఘరానా లేడి.

ఈ యువతి 11 మంది యువకులను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంది. ఓ బాధిత వరుడు ఆమెను ‘ది రన్ వే బ్రైడ్’ గా పోల్చాడు. తనను ఫేస్ బుక్ ద్వరానే పెళ్లి చేసుకుని మోసం చేసిందని తెలిపాడు. ఆమె మోసాన్ని ఓ బాధిత వరుడు ఫేస్ బుక్ లో  ఈ కిలాడీ లేడి మోసాన్ని వివరిస్తూ పోస్టు పెట్టాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెపై 11 మంది యువతిపై కేసు పెట్టారని పోలీసులు మీడియాకు తెలిపారు. ఆమెను అదుపులోకి తీసుకుని  విచారించారు. ఒక ఆగస్టులోనే 4 పెళ్లిళ్లు చేసుకున్నట్టు తేలింది.