అమరావతి అసెంబ్లీని మీరే డిసైడ్ చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి అసెంబ్లీని మీరే డిసైడ్ చేయండి

December 13, 2017

అమరావతి అసెంబ్లీ డిజైన్ లను ఎంపిక చేసే అవకాశాన్ని ప్రజలకే ఇచ్చింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతిని నిర్మించాలని భావిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జపాన్, సింగపూర్ ఆర్కిటెక్ట్ కంపెనీలను ఇందుకు పురమాయించారు.

అయితే అవేవి నచ్చకపోవడంతో లండన్  అర్కిటెక్ట్ కంపెనీ నార్మన్ పోస్టర్ ను పిలిపించారు. వాళ్ల డిజైన్లు కూడా నచ్చకపోవడంతో చివరకు డైరెక్టర్ రాజమౌళి శరణు జొచ్చారు. దీంతో మాహిష్మతిని తలదన్నేలా అమరావతి ఉంటుందని ఏపీ పబ్లిక్ ఫుల్ ఖుషీ అయ్యారు. అందుకు తగ్గట్టుగానే రాజమౌళి కూడా అసెంబ్లీ డిజైన్లను రూపొందించి చంద్రబాబుకు చూపించారు. కాని అవి బాబు కు నచ్చలేదు. కట్టడాల్లో ఆధునికత కనిపించడం లేదని హైటెక్ సిఎం డిసప్పాయింట్ అయ్యారు.

రాజమౌళి డిజైన్లకు నో చెప్పారు. ఆ తర్వాత నార్మన్ పోస్టర్ వాళ్లు ఇచ్చిన డిజైన్లలో రెండింటిని ఫైనల్ చేసి ఇవాళ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. ప్రజల సలహాలు కోరారు. స్పైక్ మోడల్ ను చంద్రబాబు నాయుడు ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది ఏది కోరితే దాన్నే ఓకే చేస్తామని ఏపీ అధికారులు చెపుతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం. ఏపీ ప్రజలారా. మీ అసెంబ్లీని మీరే డిసైడ్ చేయండి.