నకిలీ బాబాల జాబితాను హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్ ( ABAP ) విడుదల చేసింది. తమను తాము దైవాంశ సంభూతులమని చెప్పకుంటున్న ఈ బాబాల వల్ల నిజమైన సాధవుల మీద ప్రజలకు నమ్మకం పోతోందని ఎబీఏపీ ఈ పని చేసింది. ఆ 14 మంది దొంగ బాబాల లిస్టులో ఎవరున్నారంటే..
రాం రహీమ్ సింగ్
ధేమా
ఆశారాం బాపు
నారాయణ సాయి(ఆశారాం కొడుకు)
రాంపాల్(ఆశారాం కొడుకు)
నిర్మల్ బాబా
ఓంబాబా
సచ్చిదానంద్ గిరి
ఇచ్ఛాదారి భీమానంద్
మల్ఖాన్ సింగ్
ఆచార్య ఖుష్ ముని
స్వామి అసిమానంద్
బృహస్పతి గిరి
ఓం నమ:శివాయ
ఈ జాబితాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికే గాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారట. హిందూ మతాన్ని భ్రష్ఠు పట్టించాలని కంకణం కట్టుకున్న ఇలాంటి బాబాలను భక్తులు అస్సలు నమ్మకూడదని అఖాడా తెలిపింది. దీపావళి తర్వాత మరో 28 మంది దొంగ భక్తుల పేర్లు కూడా ప్రకటిస్తారట. అలాగే ఈ జాబితాలోని దొంగ బాబాల మీద చర్యలు తీసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తామని అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరి తెలిపారు.