10 సెకన్లలో 15 అంతస్థుల భవంతిని కుప్పకూల్చారు - MicTv.in - Telugu News
mictv telugu

10 సెకన్లలో 15 అంతస్థుల భవంతిని కుప్పకూల్చారు

March 30, 2018

టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతూనే వుంది. ఆకాశాన్నంటే భవంతులు నిర్మించినా.. పాతబడిన వాటిని కూట్చటంలో కొత్త టెక్నాలజీ వచ్చింది. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా కూల్చే టెక్నాలజీ అభివృద్ధి అయింది. చైనాలో 20 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ 15 అంతస్థుల భవంతిని ఎవరికీ హాని జరగకుండా నేలమట్టం చేశారు. ‘ డైలీ మెయిల్ ‘ కథనం ప్రకారం.. సౌత్ వెస్ట్ చైనా నగరం చెంగ్డూ ప్రాంతంలోని ఈ భవంతిని కూల్చి వేయాలని పోలీసులు నిర్ణయించారు. ఎగ్జిబిషన్ సెంటర్‌గా దీనిని వినియోగిస్తున్నారు. పాతబడిన ఆ భవంతి ఎప్పటికైనా ప్రమాదమే కావున దాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అక్కడున్నవారు ససేమిరా ఖాళీ చేయమన్నా పోలీసులు వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. డైనమైట్లను అమర్చి 150 అడుగుల ఎత్తున్న ఆ భవనాన్ని కూల్చివేశారు. చుట్టూ అంతే ఎత్తయిన భవనాలున్నా, వాటికి ఏ మాత్రం నష్టం కలుగకుండా జాగ్రత్తపడి విజయం సాధించారు. భవంతి కుప్పకూలినప్పుడు భారీ ఎత్తున పొగ, దుమ్ము, ధూళి ఆవరించాయి. దానికి సంబంధించిన వీడియోను మీరూ చూడండి.