డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 168 మందికి జైలు శిక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 168 మందికి జైలు శిక్ష!

February 24, 2018

తాగి బండి నడపద్దు అని పోలీసులు ఎంత మొత్తుకున్నా తాగెటోళ్లు తాగుతనే ఉన్నరు, డ్రంకన్ డ్రైవ్‌లో దొర్కుతనే ఉన్నరు. హైదరాబాద్‌లో గత ఐదు రోజుల్లో చేసిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో దాదాపు 740 మందిపై కేసులు నమోదయ్యాయి.

వీరిలో చాలామందికి జరిమానా  విధించంగా, ఫుల్లు రిమ్మ మీదున్న మందుబాబులు 168 మందికి 2 రోజుల నుండి 15 రోజుల వరకు జైలు శిక్ష పడింది. 72 మంది డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా హుష్ కాకి అయినాయి. జరిమాన విధించినవాళ్ల ద్వారా మొత్తం రూ.15.84 లక్షలు వచ్చాయట. అంటే సూడిన్రి… దొర్కితె జరిమాన అయినా కడతాం కానీ తాగకుండా ఉండలేం అని చెప్పకనే చెబుతున్నారు తాగుబోతులు. ఇక జైలుశిక్ష పడ్డ 168 మందిని  పోలీసులు చంచల్ గూడ జైలుకు పంపారు.