mictv telugu

హైదరాబాద్‌కు హ్యాండ్‌బాల్ పండగ వచ్చేస్తోంది..

February 13, 2019

ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు, విశేషాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్ నగరం ఈసారి క్రీడావేడుకలతో మురిపించనుంది. దేశంలో మొట్టమొదటి అంతర్ జిల్లా హ్యాండ్‌బాల్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది మేలో ఫస్ట్ ఆలిండియా ఇంటర్ డిస్ట్రిక్ అండర్15 చాంపియన్‌షిప్ పోటీలను భాగ్యనగరంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి జగన్ మోహన్ రావు తెలిపారు.

Telugu news 1st All India Inter-District U-15 Handball Championship to be held in Hyderabad

తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వరంలో మే 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ పోటీలు సాగుతాయి. ఈమేరకు హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్జ్‌లైవ్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను లక్నోలో విడుదల చేశారు. పోటీల్లో టీస్పోర్ట్స్ సంస్థ కీలక పాత్ర పోషించనుంది.

స్పోర్జ్‌లైవ్ సంస్థ బ్యాడ్మింటన్ లీగ్ కూడా నిర్వహిస్తోంది. జూలైలో తాము తొలి ప్రో హ్యాండ్ బాల్ లీగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, ఏడుగురు భారతీయ, ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లతో కూడా 8 ఫ్రాంచైజీలను రూపొందిస్తున్నామని సంస్థ తెలిపింది. Telugu news 1st All India Inter-District U-15 Handball Championship to be held in Hyderabad