రైల్వేకి  2 కోట్ల దరఖాస్తులు.. నిరుద్యోగ విశ్వరూపం - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేకి  2 కోట్ల దరఖాస్తులు.. నిరుద్యోగ విశ్వరూపం

March 28, 2018

జనాభా పెరుగుదల ఆగదు..  నిరుద్యోగ సమస్య తరగదు. రైల్వేలో ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులే దీనికి ఉదాహరణ. రైల్వేల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. 90 వేల పోస్టులకు నోటిఫికేషన్ వదిలారు. అభ్యర్థుల నుంచి వచ్చిన స్పందన చూసి రైల్వేశాఖ అవాక్కయింది. ఇప్పటివరకు 2 కోట్లకుపైగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి.

అంటే ఒక్కో ఉద్యోగానికి 222 మంది పోటీ పడుతున్నట్లు లెక్క. చివరితేదీకి గడువు వుండటంతో ఇంకా ఎన్ని దరఖాస్తులు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.. ఇంత భారీ పోటీ నెలకొనటంపై రైల్వేశాఖ విస్తుబోతోంది. ఇంతమందికి పరీక్షలు ఎలా నిర్వహించాలని జుట్టు పీక్కుంటోంది.