mictv telugu

గృహప్రవేశానికి ఏనుగు.. ఇద్దరి మృతి

February 9, 2019

గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిదే చేయాలి అంటారు. గృహ ప్రవేశానికి ఆవు బదులు ఏనుగును తీసుకొచ్చి ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నాడో ప్రబుద్ధుడు. కేరళలోని గురువాయూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

షైజు అనే వ్యాపారి కొత్తగా ఇల్లు నిర్మించి గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లూ చేశాడు. అందరూ  గృహప్రవేశానికి ఆవును తీసుకొస్తుంటారని, తాను అలా చేస్తే ప్రత్యేకత ఏముంటుందనుకుని ఏనుగుపై మొగ్గు చూపాడు. అది కూడా నేరచరిత్ర ఉన్న, ఒంటి కన్ను ఏనుగును ఎంచుకున్నాడు. గురువాయూర్  దేవాలయం నుంచి 54 ఏళ్ల వయసు గల ఏనుగును తీసుకువచ్చాడు. దాని పేరు రామచంద్రన్. గృహప్రవేశం అంగరంగ వైభవంగా మొదలైంది. రామచంద్రన్ మెల్లగా వచ్చేసింది. అంతలో పక్కింట్లోంచి బాణసంచా శబ్దాలు వినిపించాడు. దీనికి తోడు షైజు తీసుకొచ్చిన మేళగాళ్లు కూడా బ్యాండు బాజా అన్నారు. దీంతో ఏనుగుకు చిర్రెత్తి అతిథులపైకి ఉరికింది. దాని కాళ్ల కింద పడి ఇద్దరు చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. షైజు నిజానికి ఈ గజాన్ని  దేవాలయంలో జరగనున్న ఉత్సవం కోసం రప్పించాడు. ముహూర్తం ఎలాగూ బాగుంది కదా అని గృహప్రవేశానికీ పట్టుకొచ్చాడు.

11 మందిని చంపింది..

రామచంద్రన్ స్వస్థలం బిహార్. 1982లో దాన్ని కేరళకు తీసుకొచ్చాడు. హిందీ మాాత్రమే అర్థమయ్యే ఈ మత్తేభానికి మొదట్లో మలయాళం అర్థం కాకా ఆగ్రహించేది. దీంతో మావటి అంకుశంతో దాన్ని కన్నుపొడిచాడు. ఫలితంగా చూపు పోయింది. రామచంద్రన్ కోపిష్టి ఎనుగు. 11 మందిని, మూడు ఏనుగులను చంపేసింది. అయినా దానికి కేరళలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఫేస్ బుక్ లో దానికో పేజీని కూడా వెలగబెడుతున్నారు. telugu news 2 Dead After Elephant Brought To House Warming Tramples Them In Kerala